
ఆర్జీయూకేటీలో ఎన్‌డీఎల్ సెషన్
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) బాసరలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ(ఎన్‌డీఎల్) రిజిస్ట్రేషన్ సెషన్ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జాతీయ డిజిటల్ లైబ్రరీలో సభ్యత్వం పొందడం, అందులోని విద్యా వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్ మాట్లాడుతూ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ విద్యార్థులకు అమూల్యమైన జ్ఞానసంపదను అంది స్తోందన్నారు. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, వివిధ అధ్యయన వనరులు ఒకే వేదికపై అందుబాటులో ఉండడంతో అకడమిక్ ప్రగతికి దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ఈ డిజిటల్ వనరులను సద్వినియోగం చేసుకుని పరిశోధ న, ఆవిష్కరణల్లో ప్రతిభ కనబర్చాలని సూ చించారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్సాహంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్యక్రమంలో లైబ్రరీ అసిస్టెంట్లు డాక్టర్ అరుణ జ్యోతి, శైలజ, అర్చన, సిబ్బంది పాల్గొన్నారు.