
దెబ్బతిన్న రోడ్లు బాగుచేయండి
కడెం: మండలంలోని మారుమూల అల్లంపల్లి గ్రామ రోడ్లు భారీ వర్షాలు, వరదలకు దెబ్బ తిన్నాయని, వాటిని బాగు చేయించాలని బీజే పీ జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ అన్నారు. అ ల్లంపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్లతో అల్లంపల్లి, బాబానాయక్‌తండా, మంగల్‌సింగ్‌తండా, మీ సాలభూమన్నగూడెం, గంగన్నపేట్, పాలరేగ డి తదితర గ్రామల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్ స్పందించి వెంట నే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరా రు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులు పరి హారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్, నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.