
ఆర్‌ఎంపీల హైడోస్!
న్యూస్‌రీల్
అర్హత లేని వైద్యం.. ప్రాణసంకటం! ఆస్పత్రులను తలపించేలా క్లినిక్‌ల నిర్వహణ జ్వరాల సీజన్‌లో జాగ్రత్త
నిర్మల్
7
యూరియా కొరత
లేకుండా చూడాలి
నిర్మల్: నర్సాపూర్(జి) మండల రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం డీసీఎంఎస్ గోదాముల్లో నిల్వఉన్న స్టాక్‌ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఫర్టిలైజర్ లైసెన్స్ ధ్రువపత్రాల గడువును పరిశీలించారు. ద్రవరూప నానో యూరియా బాటిళ్లను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఏఈవో గణేశ్ ఉన్నారు.
నిర్మల్ : తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (రిజి స్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2010 ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌లు (ఆర్‌ఎంపీలు) గ్రామాల్లో అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించడానికి మాత్రమే అర్హులు. వారి ప్రధాన విధి ఫస్ట్ ఎయిడ్ చేసి, రోగిని సమీప ఆస్పత్రికి తరలించడం. తమ క్లినిక్‌లను ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు లేదా మెడికల్ హాల్‌లుగా పేర్కొనడం, పేరు ముందు ‘డాక్టర్’ ఉపయోగించడం, ఇన్‌పేషెంట్‌లను చేర్చుకోవడం నిషిద్ధం. అయితే, కొందరు ఆర్‌ఎంపీలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ చిన్నపాటి ఆస్పత్రులను నడుపుతున్నారు, ఇవి ఇటీవల అధికారుల దాడుల్లో బయటపడ్డాయి.
అనర్హ వైద్యంతో ప్రమాదం..
జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలు తమ అర్హతలను మీరి వైద్యం చేస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ స్థాయిలో మందులు రాస్తూ, రక్తపోటు, మధుమేహం మాత్రలు సూచిస్తున్నారు. కొందరు సంతానలేమి చికిత్సలు, మగపిల్లల జననం కోసం మందులు ఇస్తున్నారు. రహస్యంగా అక్రమ గర్భస్రావాలు చేయడం లేదా తెలిసిన వైద్యులతో చేయిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల ఆర్‌ఎంపీల వైద్యంతో ఇద్దరు మృతి చెందారు.
జాగ్రత్త సుమా..
ప్రస్తుతం వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు వంటి వ్యాధులు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో కొందరు ఆర్‌ఎంపీల వద్ద జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆస్పత్రులకు సమానమైన రద్దీ కనిపిస్తోంది. మోతాదుకు మించిన మందులు ఇవ్వడం వల్ల రోగాలు త్వరగా తగ్గినట్లు కనిపించినా, దీర్ఘకాలంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది స్థానికులను ఆర్‌ఎంపీల వైపు ఆకర్షిస్తున్నప్పటికీ, దీర్ఘకాల పరిణామాలను వారు గుర్తించడం లేదు. ప్రజలు అర్హతలేని ఆర్‌ఎంపీల వద్ద చికిత్సలు తీసుకోకుండా, ధ్రువీకరణ పొందిన వైద్యులను ఆశ్రయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
తనిఖీలు కొనసాగిస్తాం..
ఇటీవల జిల్లాలో అర్హతలేని వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలపై చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు తరచూ దాడులు చేస్తున్నాం. ఈ తనిఖీలను కొనసాగిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వైద్యం చేసినా చర్యలు తప్పవు.
–డాక్టర్ రాజేందర్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో
‘ఇయాల్టికి మూడ్రోజులాయే.. దగ్గు, జరం తగ్గుతనే లేదు. మా కొడుకు తెచ్చిన గోలీలేసుకుంటున్న ఏం ఫాయిదా లేదు. ఇగ రేపు నిర్మల్‌వోయి దవాఖాన్ల సూపిచ్చుకుంటా అంటున్న..’ అని నర్సయ్య దగ్గుకుంట చెబుతుండంగనే.. ‘అరె..నర్సన్న నిర్మల్‌దాకా ఎందుకే..! మనూళ్లె డాక్టరే రెండు సూదులు గుచ్చిండంటే ఖతం.. నీ దగ్గు, జరం అన్నీ పోతయ్..పో.’ అని రమేశ్ చెప్పాడు. నర్సయ్య ఊళ్లో ఆర్‌ఎంపీ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. రమేశ్ చెప్పినట్లే.. రెండురోజుల్లో నర్సయ్య దగ్గు, జరం, ఒంటినొప్పులన్నీ పోయాయి. ఇదెలా సాధ్యం..!? అని కాస్త చదువుకున్న నర్సయ్య కొడుకు ఆరాతీస్తే.. ఆ ఆర్‌ఎంపీ ఇచ్చినవి అధిక డోసు మందులు. పేషెంట్‌కు భవిష్యత్తులో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా.. ఇలా చాలామంది అర్హతలేని ఆర్‌ఎంపీలు యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. ఇవేవీ.. తెలియని గ్రామీణులు వారి వైద్యాన్ని గుడ్డిగా నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
25న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
నిర్మల్‌రూరల్: జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మనాభంగౌడ్, శామ్యూల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పరుగు పందెం, త్రోజ్ జంప్ అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు ఉంటాయని వివరించారు. విజేతలను మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో రిపోర్టు చేయాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9440516634, 8501054234 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

ఆర్‌ఎంపీల హైడోస్!

ఆర్‌ఎంపీల హైడోస్!