
‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోవాలి
కడెం: ఈజీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. మండలంలోని ధర్మాజీపేట్ గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ నర్సింహులు, డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి ఉపాధిహామీ పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. లక్ష్మీసాగర్ గొండుగూడలో తొమ్మిది గొర్రెల షెడ్లను ప్రారంభించారు. అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా పనుల జాతర కార్యక్రమం చేపట్టామన్నారు. షెడ్ల నిర్మాణానికి నిధులు తగ్గించకుండా చూడాలని రైతులు ఎమ్మెల్యేను కోరారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ భూషణ్, తహసీల్దార్ ప్రభాకర్, ఏపీడీ ప్రసాద్, ఎంపీడీవో అరుణ, ఏపీవో జయదేవ్, ఆర్‌ఐ శారద, ఏపీఎం గంగాధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, జిల్లా నాయకుడు సతీశ్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఉపయోగపడే పనులు చేయాలి
నిర్మల్ రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు, కూలీలకు పనికొచ్చే పనులు చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈజీఎస్ నిధులతో నిర్మించిన పశువుల పాకను లబ్ధిదారులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో గొర్రెలు, పశువుల పాకలు, పౌల్ట్రీ, పొలం బాటలు వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో వందశాతం అక్షరాస్యతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం 100 రోజుల పనులు పూర్తిచేసిన కూలీలను సన్మానించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఎంపీడీవో గజానన్, అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.