
మళ్లీ ముందస్తే..!
నూతన మద్యం పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ షాపు లైసెన్సు ఫీజు 50% పెంపు ఆందోళనలో వైన్స్ యజమానులు గత పాలసీతోనే నష్టాలు వచ్చాయని ఆవేదన
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన నూతన మద్యం పాలసీలో మద్యం దుకాణాల లైసెన్స్ అప్లికేషన్ ఫీజును రూ.3 లక్షలుగా నిర్ణయించింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజుకు 50 శాతం అదనంగా విధించింది. ఈ పెరిగిన ఫీజు, కఠిన నిబంధనలు లిక్కర్ వ్యాపారులను, అలాగే ఈ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునేవారిని నిరుత్సాహపరుస్తున్నాయి. జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 18 మండలాల పరిధిలో 47 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల కోసం రిజర్వేషన్ విధానం అమలులో ఉంది. ఇందులో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించారు. లైసెన్స్ ఫీజు జనాభా ఆధారంగా ఆరు స్లాబ్‌లుగా విభజించింది ఎకై ్సజ్ శాఖ. 5 వేల జనాభా వరకు రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు, లక్ష జనాభా ఉంటే రూ.60 లక్షలు. లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లో రూ.85 లక్షలుగా పేర్కొంది.
ఆందోళనలో జిల్లా వ్యాపారులు..
2023–25 మద్యం పాలసీ సమయంలో జిల్లాలో 47 దుకాణాల కోసం 1,067కు పైగా టెండర్లు దాఖలయ్యాయి. దరఖాస్తుల ద్వారా ఎకై ్సజ్ శాఖకు రూ.21.34 కోట్ల ఆదాయం (నాన్–రిఫండబుల్) సమకూరింది. అయితే, టెండర్ల సమయంలో కనిపించిన పోటీ వ్యాపారం ప్రారంభమైన తర్వాత కనిపించలేదు. చాలా మంది వ్యాపారులు పెట్టుబడికి తగిన ఆదాయం లేక నష్టపోతున్నామని పేర్కొంటున్నారు. కొందరు గుడ్‌విల్ కింద అమ్మేందుకు యత్నించినా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లాలో నెలకు రూ.20 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రూ.400 కోట్ల వ్యాపారం నమోదైంది. గత పాలసీలోనే వ్యాపారం గిట్టుబాటు కాలేదని, ఇప్పుడు దరఖాస్తు ఫీజు 50 శాతం పెంపుతో వ్యాపారం చేయలేమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ముందస్తు ఇలా..
ప్రస్తత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టెండరు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో మద్యం దుకాణాల లైసెన్స్ జారీకి షెడ్యూల్ విడుదల చేయనుంది. అదే నెలలో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అక్టోబర్‌లో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను కేటాయించే అవకాశం ఉంది. ఎకై ్సజ్ శాఖ కమిషనర్ ఆదేశాల ఆధారంగా ఈ ప్రక్రియ ముందుకు సాగనుంది.
వివరాలు
అర్బన్ ఏరియాలో వైన్సులు బార్లు
నిర్మల్ 11 4
ఖానాపూర్ 3 1
భైంసా 5 8
18 మండలాల పరిధిలో 28 షాపులు
గత పాలసీల్లో వచ్చిన
దరఖాస్తులు, ఆదాయం..
సంవత్సరం దరఖాస్తులు ఆదాయం
2021–23 636 రూ.12.72 కోట్లు
2023– 25 1067 రూ.21.34 కోట్లు