
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్ సూచించారు. ఏఎస్పీ రాజేశ్‌మీనాతో కలిసి పట్టణంలోని బుధవార్‌పేట్ నంబర్ వన్ గణేశ్ మండపం నుంచి ఓల్డ్ బస్టాండ్, బాగులవాడ చౌక్ (ఎంఎల్‌ఏ క్యాంపు ఆఫీస్), గుల్జార్ మార్కెట్, గాంధీచౌక్ మార్గంగా బంగల్‌పేట్ చెరువు నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించారు. పట్టణంలో విగ్రహాల ప్రతిష్టాపన, నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. వారివెంట ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్ రాజు, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఆది కర్మయోగి అభియాన్ అమలు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలో గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ కింద అమలుకు చేస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గిరిజన జనాభాకు విద్య, వైద్యం, మౌలిక ఆర్థిక సదుపాయాలు అందించడంతోపాటు, గ్రామస్థాయిలో పాలనను బలోపేతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. అర్హులందరికీ పథకం ఫలాలు అందించాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన ఏడుగురు మాస్టర్ ట్రైనర్లు హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ పొందినట్లు తెలిపారు. సమావేశంలో గిరిజనాభివృద్ధి అధికారి అంబాజీ, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఈవో రామారావు, డీపీవో శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య, డీఏవో అంజిప్రసాద్, ఉద్యానవన అధికారి రమణ, పశుసంవర్ధకశాఖ అధికారి రాజేశ్వర్, గ్రామీణ నీటి సరఫరా అధికారి సందీప్, వైద్యశాఖ అధికారి సౌమ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రాంగోపాల్ పాల్గొన్నారు.