
ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆదేశించారు. నిర్మల్ రూరల్ మండలం చిట్యాలలోని ఎరువుల దుకాణం తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, యూరియా, డీఏపీసహా అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకే ఎరువులు వాడాలని సూచించారు. ఆయన వెంట డీఏవో అంజిప్రసాద్, సంబంధిత అధికారులు ఉన్నారు.
నానో యూరియా వాడాలి
కుంటాల: పెట్టుబడుల తగ్గింపు, అధిక దిగుబడుల కోసం రైతులు నానో యూరియా వాడాలని డీఏవో అంజిప్రసాద్ సూచించారు. మండలంలోని విఠాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో రైతులకు నానో యూరియాపై గురువారం అవగాహన కల్పించారు. నానో యూరియా ద్రవ రూపంలో ఉండి నేరుగా మొక్కకు అందుతుందని తెలిపారు. డీఏవో వెంట ఏవో విక్రమ్, ఏఈవో గణేశ్, రైతులు ఉన్నారు.