
భైంసాలో పీస్ కమిటీ సమావేశం
భైంసాటౌన్: పట్టణ ప్రజలు పండుగలు, ఉత్సవాలు శాంతియుతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్, ఏఎస్పీ అవినాష్‌కుమార్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో మతపెద్దలు, గణేశ్ మండపాల నిర్వహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులతో గురువారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. అధ్వాన్న రోడ్లు, విద్యుత్ తీగలు, స్తంభాలతో ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. సున్నిత ప్రాంతంగా భైంసాకు ఉన్న పేరును తొలగించుకునేలా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, ఆత్మ చైర్మన్ వివేకానంద, మున్సిపల్ కమిషనర్ రాజేశ్‌కుమార్, సీఐ గోపీనాథ్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, మతపెద్దలు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.