
సమస్యల పరిష్కారంలో విఫలం
ఖానాపూర్: రైతాంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అఖి ల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ ప్రభాకర్ ఆరోపించారు. మండలంలోని అడవిసారంగాపూర్ గ్రామంలో ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అంకుష్‌రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ప్రథమ మహాసభకు హాజరై మాట్లాడారు. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నాయ ని విమర్శించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షుడు నందిరామయ్య ఏఐయూకేఎస్ సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కార్యదర్శి కట్ల రా జన్న, నాయకులు జక్కుల రాజన్న, అడ్డగట్ల శంకర్, ఎల్లయ్య, గోరేబాయ్, సుదర్శన్, మహేందర్, చాంద్‌పాషా, రాజన్న, శ్రీనివాస్, భీంరావు, లింగు, లచ్చన్న, సంజీవ్, రాజేశ్వర్ తదితరులున్నారు.