
పశువులకు వ్యాధులు సోకకుండా చూడాలి
లక్ష్మణచాంద: పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన టీకాలు వేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. పశు వైద్యులతో మాట్లాడి నీలి నాలుక వ్యాధి నివారణకు ఇచ్చే టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పశువుల్లో అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి అంబాజీ, ఎంపీడీవో రాధ రాథోడ్, పశువైద్య అధికారి శ్రీనివాస్, అధికారులు, రైతులు పాల్గొన్నారు.