
గల్ఫ్ జైలులో జిల్లా వాసి
● దుబాయ్ పోలీసులకు చిక్కిన వలస కార్మికుడు ● క్షేమసమాచారం తెలియక కుటుంబం ఆందోళన ● స్వదేశానికి రప్పించాలని వినతి...
నిర్మల్‌ఖిల్లా: ఉపాధికోసం ఎడారి దేశం వెళ్లిన జిల్లావాసి కటకటాలపాలైన సంఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సారంగాపూర్ మండలం దేవితండా గ్రామానికి చెందిన జాదవ్ మధుకర్ కొన్నేల్లుగా విదేశాల్లో ఉపాధి పొందుతున్నాడు. రెండేళ్లకుపైగా ఖతార్‌లో ఉండి స్వగ్రామాని కి వచ్చాడు. స్థానికంగా కొన్నినెలలపాటు ఉండి సరైన ఉపాధి లేకపోవడంతో దుబాయ్ వెళ్లడం కోసం ముంబైకి చెందిన ఏజెంటును సంప్రదించాడు. రూ.80 వేలు చెల్లించి విజిట్ వీసాపై గతేడాది అబు దాబి వెళ్లాడు. అక్కడ మోర్గంటి మెయింటెనెన్స్ అండ్ ఫెసిలిటీస్ కంపెనీలో క్లీనర్‌గా ఉద్యోగంలో చేరాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే గతనెల 21 తేదీన లేబర్ క్యాంపు బయట మద్యంసీసాలతో పోలీసులకు పట్టుపడ్డాడు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. అప్పటి నుంచి మధుకర్ సమాచారం ఇటు కంపెనీ వైపు నుంచిగానీ, అటు పోలీసుల నుంచి గానీ అందకపోవడంఓత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మఽ దుకర్ తండ్రి జాదవ్ గణేశ్ గురువారం కలెక్టర్ కా ర్యాలయంలో వినతిపత్రం అందించారు. తర్వాత రాష్ట్ర ఎన్నారై అడ్వైజర్ కమిటీ సభ్యుడు, ప్రవాసీమి త్ర కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పర్కిపండ్లను కలిసి వివరాలు అందజేశారు. ఎలాగైనా తమ కుమారుడిని స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. స్పందించిన స్వదేశ్ అబుదాబీలోని భారత కాన్సులేట్ కార్యాలయానికి బాధితుని వివరాలను మెయిల్ ద్వారా పంపారు. ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు...
అక్రమ మార్గంలో గల్ఫ్ వెళ్లొద్దు..
విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు అక్రమ మార్గంలో వెళ్లవద్దని, వృత్తిపరమైన శిక్షణతో కూడిన పనులను వీసా రుసుము చెల్లించిన తర్వాతనే ఉపాధి పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని స్వదేశ్ పర్కిపండ్ల సూచించారు. ప్రవాసీ భారత బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు.