
తల్లిపాలతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం
నిర్మల్‌చైన్‌గేట్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణా నికి తల్లిపాలు దోహదపడతాయని మెడికల్ కళాశా ల ప్రిన్సిపల్ సీవీ శారద పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో తల్లిపా ల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది సామాన్యులకు అర్థమయ్యేలా తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఆకట్టుకుంది. నర్సింగ్ కాలేజ్ మొదటి సంవత్సరం విద్యార్థినులు తల్లిపాల విశిష్టతను తెలుపుతూ ప్లకార్డుల ద్వారా అవగాహన క ల్పించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. పుట్టిన వెంటనే బిడ్డలకు ముర్రుపాలు పట్టించాలని, మొదటి ఆరునెలలు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రసూతి ఆస్పత్రి హెచ్‌వోడీ సరోజ, ఆర్‌ఎంవో సమత, నర్సింగ్ పర్యవేక్షకురాలు ధనలక్ష్మి, నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మంజుల, పిల్లల వైద్యనిపుణులు వసు, ప్రదీప్ పాల్గొన్నారు.