విషజ్వరాల విజృంభణ | - | Sakshi
Sakshi News home page

విషజ్వరాల విజృంభణ

Aug 7 2025 10:01 AM | Updated on Aug 7 2025 10:01 AM

విషజ్

విషజ్వరాల విజృంభణ

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంటా చూసినా జ్వర బాధితులే కనిపిస్తున్నారు. ఎక్కడికెళ్లినా వైరల్‌ ఫీవర్ల గురించే చర్చ నడుస్తోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ సీ జనల్‌ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. జ్వరంతో పా టు ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు వచ్చి ఎంతకూ తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ఆరంభమైన తర్వాత అపరిశు భ్ర వాతావరణం, వర్షపునీరు నిలిచి దోమలు విజృంభించి వ్యాధులకు కారణమవుతాయి. ఈ సీజన్‌లో చాలామందికి జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటా యి. అయితే ఈసారి మాత్రం విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. వైద్యులు కూడా జ్వరపీడితులు చెప్పే లక్షణాలు చూసి విస్తుపోతున్నారు. సాధారణంగా ఇచ్చే యాంటీ బయోటిక్స్‌కు జ్వరాలు తగ్గడంలేదు. దీంతో ఎక్కువ డోస్‌ ఉన్న మందులు రాస్తున్నారు. బాధితుల్లో చాలామంది బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌, ఒంటి నొప్పులు, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ఒకేసారి అన్నిరకాల సమస్యలు చుట్టుముట్టడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

వారంరోజుల్లోనే పెరిగిన బాధితులు

జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వారం రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా పట్టణం, పల్లె అనే తేడా లేకుండా దోమలు వృద్ధి చెంది విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విరోచనాలు, మలేరియా, డెంగీ లాంటి సీజనల్‌ వ్యాధులతో జనం బాధ పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లా ప్రభుత్వాస్పత్రికి వా రం క్రితం వరకు వెయ్యిలోపు ఓపీ ఉండగా ప్రస్తు తం సంఖ్య ఎక్కువైంది. మంగళవారం ఒక్కరోజే 1,400 మంది జ్వరపీడితులు ఆస్పత్రికి వచ్చారు.

ఆరోగ్యశాఖ అప్రమత్తం

సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. సంబంధిత శాఖ అధికారు లు, సిబ్బంది జిల్లాలో విషజ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్ర, మంగళవారాల్లో డ్రైడే పాటించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

జిల్లాలో ఇంటింటా బాధితులే

దగ్గు, జలుబుతో ఇబ్బందులు

ఒంటి నొప్పులతో ఉక్కిరిబిక్కిరి

చాలామందిలో బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌

నియంత్రణ చర్యల్లో వైద్యశాఖ

ఈ ఫొటోలోని బాలుడు అనాజ్‌ఖాన్‌ది నేరడిగొండ మండలం వాంకిడి. ఇతను వారంరోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు నాలుగురోజుల క్రితం వరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం, ఒళ్లు నొప్పులు త గ్గలేదు. దీనికి తోడు ప్లేట్‌లెట్‌ల సంఖ్య తగ్గు తూ వచ్చింది. రెండురోజుల క్రితం జిల్లా జనర ల్‌ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స కొనసాగుతోంది.

పెరిగిన ‘ప్రైవేట్‌’ దోపిడీ

పీహెచ్‌సీల్లో డెంగీ కిట్లు అందుబాటులో లేక పోవడం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వరంగా మారింది. జ్వరాల బారిన పడిన పలువురు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన యాజమాన్యాలు ఒక్కో టెస్ట్‌కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిన జ్వర పీడితుల నుంచి టెస్ట్‌లు, మందులు, చికిత్స పేరిట అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విషజ్వరాల విజృంభణ1
1/2

విషజ్వరాల విజృంభణ

విషజ్వరాల విజృంభణ2
2/2

విషజ్వరాల విజృంభణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement