
నైపుణ్యాలు పెంపొందేలా బోధించాలి
నిర్మల్ రూరల్: విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా బోధన కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. బుధవారం మండలంలోని ర త్నాపూర్‌కాండ్లి జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. తరగతులు పరిశీలించారు. విద్యార్థుల హాజరు, పా ఠ్యపుస్తకాలు, యూనిఫాంల సరఫరాపై ఆరా తీశా రు. విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరీక్షించారు. ఉత్తమ ఫలితాల సాధనకు సన్నద్ధం కావాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు రూపొందించిన భారతదేశ భౌగోళిక పటాన్ని చూసి అభినందించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరి శీలించి విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించా రు. ఆరోతరగతి విద్యార్థిని అక్షయ స్వయంగా గీసి అందించిన తన ఫొటోను చూసి కలెక్టర్ ఆమెను అ భినందించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నా టారు. కిచెన్ గార్డెన్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి కూరగాయల విత్తనాలు నాటారు. డీఈవో రామారావు, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజా నన్, ఎంఈవో వెంకటేశ్వర్లు తదితరులున్నారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
నిర్మల్‌చైన్‌గేట్: భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే కారణాలు తప్పనిసరిగా పొందుపరచాలని సూచించారు. సీఎంఆర్ డెలివరీని సకాలంలో పూర్తి చేయని మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని, సదరు మిల్లర్ల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకూ వెనుకాడవద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్ సుదర్శన్, పీడీ హౌసింగ్ రాజేశ్వర్, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.