
జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయ న చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళుల
ర్పించారు. అనంతరం ఆమె తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ చేసిన కృషిని కొనియాడారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, సీపీవో జీవరత్నం, బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఏవో సూర్యారావు, డీఐఈవో పరశురాం, మెప్మా పీడీ సుభాష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాసర: బాసర ఆర్జీయూకేటీలో జయశంకర్ చిత్రపటానికి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ పూలమాలలు వేసి నివాళులర్పించా రు. జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానా న్ని వివరించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్, కల్చరల్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ రాములు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి