
‘ఆధార్’ అప్‌డేట్ లేదని.. మహాలక్ష్మి పథకం వర్తించదని..
● మహిళలను బస్సు దించిన కండక్టర్
భైంసారూరల్: ఆధార్‌కార్డులు అప్‌డేట్ చేసుకో నందున మహాలక్ష్మి పథకం వర్తించదని ఆర్టీసీ కండక్టర్ మహిళలను మధ్యలోనే బస్సు దించేశారు. వివరాలు.. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సులో బుధవారం భైంసాలో కొందరు మహిళలు ఎక్కారు. వారి ఆధార్‌కార్డుల్లో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ అని ఉండగా అవి చెల్లవంటూ కండక్టర్ వారిని దేగాం వద్దే దింపేశారు. దీంతో మహిళలు కండక్టర్‌తో గొడవకు దిగారు. ప్రతీ సారి ఇదే కార్డుపై ప్రయాణిస్తున్నామని తెలిపా రు. ఆధార్ అప్డేట్ ఉంటే తీసుకువెళ్తానని కండక్టర్ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో అరగంట సేపు బస్సు అక్కడే ఆగిపోయింది. తర్వాత భైంసా డిపో బస్సు రాగా వారు అందులో ఎక్కి వెళ్లిపోయారు. దీనిపై డిపో మేనేజర్‌ను వివరణ కోరగా సంస్థ ఎండీ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని పేర్కొన్నారు.