● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సారంగపూర్: స్వర్ణ ప్రాజెక్టు ఆధునికీకరణకు తనవంతు కృషి చేస్తానని, ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తానని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. స్వర్ణ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గురువారం సాగునీరు విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్టు ఆనకట్టపై రూ.32 లక్షలతో ఏర్పాటు చేసే లైటింగ్ పనులను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా సారంగాపూర్‌కు చేరుకుని స్వర్ణ ప్రాజెక్టు మధ్యకాలువ(జౌళినాళ)పై 46 లక్షలతో క్రాస్ రెగ్యూలేటరీ, ఎస్కేప్ రెగ్యులేటరీ పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ స్వర్ణ ప్రాజెక్టు ఆయకట్టు గతంలో 10 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం కాలువలు సరిగా లేక, నిర్వాహణ లోపంతో విస్తీర్ణం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు సమీకరిస్తానని తెలిపారు. వర్షాలు ఆలస్యం అయిన నేపథ్యంలో నారుమడుల కోసం నీటిని విడుల చేశామన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ డీఈ శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ తుక్కారాం, స్థానిక తహశీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఏఈలు మధుపాల్, వేణుగోపాల్, మండల నాయకులు కాల్వ నరేశ్, తిరుమలచారి, విలాస్, గంగారెడ్డి, రాజేశ్వర్, నారాయణ, మోహన్, భీమలింగం, సామల వీరయ్య, చంద్రప్రకాశ్‌గౌడ్, రాజారెడ్డి, ఆయా గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యం కోసమే హెల్త్ సబ్‌సెంటర్లు
సారంగపూర్: ప్రజల రోగ్యం, వారి మెరుగైన జీవన విధానం కోసమే ఆరోగ్య ఉపకేంద్రాలను నిర్మిస్తున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని స్వర్ణ, కౌట్ల(బి), మలక్‌చించోలి, జామ్, ధని, గ్రామాల్లో ఒక్కోటి రూ.20 లక్షలతో నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రాలకు భూమిపూజ చేశారు. ధని గ్రామం నుంచి రాజరాజేశ్వర తండా వరకు రూ.1.60 లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డుకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో పీఆర్ డీఈ తుక్కారాం, ఏఈ దేవీదాస్, వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్ రాజేందర్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ అబ్దుల్ జవాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్, నాయకులు రావుల రాంనాథ్, మోహ న్, భీమలింగం, సామల వీరయ్య, తిరుమలాచారి, విలాస్ కాల్వ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.