
ఎట్టకేలకు కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు
● విద్యాసంవత్సరం ప్రారంభమైన నెల తర్వాత చేరిక.. ● 30 రోజులు ఇబ్బందిపడ్డ విద్యార్థులు
లక్ష్మణచాంద: పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన బాలికలు ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలో ఆపివేయకుండా నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కస్తూరిబాగాంధీ బాలికా విదాలయాల (కేజీబీవీ)ను స్థాపించింది. ఈ విద్యాలయాలు ఇంటర్మీడియెట్ స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యా యి. బాలికలకు వసతి సౌకర్యంతో కూ డిన విద్య ను అందిస్తున్నాయి. అయితే, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు నెల తర్వాత ఎట్టకేలకు జిల్లాకు వచ్చాయి. ఈ ఆలస్యంతో విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు.
జిల్లాలో 18 కేజీబీవీలు..
జిల్లాలో 18 కేజీబీవీ సంస్థలు ఉన్నాయి. వీటిలో 15 కళాశాలలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఈ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1,200 మంది, ద్వితీయ సంవత్సరంలో 880 మంది చదువుతున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో కేజీబీవీలు జూన్ 12న ప్రారంభమయ్యాయి. పాఠశాలలో మొదటిరోజు పాఠ్యపుస్తకాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ, నెల రోజులు దాటిన తర్తా పుస్తకాలు వచ్చాయి. దీంతో కొందరు విద్యార్థినులు సీనియర్ విద్యార్థుల నుంచి పాత పాఠ్యపుస్తకాలు సేకరించి చదువుకోగలిగారు, సీనియర్లతో సంబంధం లేని విద్యార్థినులు ఇబ్బంది పడ్డారు. రెండు రోజుల క్రితం పాఠ్యపుస్తకాలు రావడం విద్యార్థులకు ఊరట కలిగించింది.
నెల రోజులు ఇబ్బంది..
జూన్ 12న కళాశాలలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రారంభం అయినరోజే పాఠ్య పుస్తకాలు అందేది. ఈసారి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందకపోవడంతో నెలరోజులు పాఠ్యపుస్తకాలు లేకుండానే తరగతులు నిర్వహించారు. పాఠాలు సక్రమంగా అర్థంకాక ఇబ్బంది పడ్డాం.
– భవ్య ఇంటర్ విద్యార్థి కేజీబీవీ
సకాలంలో అందిస్తే మేలు
జిల్లాలోని కేజీబీవీ కళాశాలలో చేరిన విద్యార్థులకు కళాశాలలు పునః ప్రారంభమైన వెంటనే పాఠ్య పుస్తకాలు సరఫరా చేసేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు రానున్న కాలంలో సమస్య రాకుండా చూసుకోవాలి.
– లక్ష్మి, ఇంటర్ విద్యార్థి కేజీబీవీ

ఎట్టకేలకు కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు

ఎట్టకేలకు కేజీబీవీలకు పాఠ్యపుస్తకాలు