
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
● ఇంటర్ బోర్డు రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు
లోకేశ్వరం/తానూరు: ఇంటర్‌లో మెరుగైన ఫలితా లు సాధించాలని ఇంటర్ బోర్డు రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వర్లు అన్నారు. లోకేశ్వరం, తానూర్, ముధోల్ జూనియర్ కళాశాలలను గురువారం తనిఖీ చేశారు. అధ్యాపకులతో మాట్లాడారు. అడ్మిషన్లు పెంచాలన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. పోషకులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్ వాటిలో ర్యాంకులు సాధించేలా చూడాలన్నారు. విద్యార్థుల అపార్ నంబర్లను జనరేట్ చేయాలన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఫేస్ రికగ్నేషన్ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అధ్యాపకులు సమయపాలన పాటించాలని సూచించారు. తానూరులో ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలో ప్రయోగశాల లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరిచేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీఐఈవో పరశురాం, లోకేశ్వరం కళాశాల ప్రిన్సిపాల్ గౌతం. ముధోల్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అబ్దుల్ రెహమాన్, అధ్యాపకులు గంగాధర్, ప్రశాంత్, గణేశ్ ఉన్నారు.