
చైతన్యంతోనే సామాజిక ప్రగతి
● బహుజన సాహితీవేత్తలు, బీసీసంఘాల ప్రతినిధులు ● ‘బహుజనగణమన’ కవితా సంపుటి ఆవిష్కరణ
నిర్మల్‌ఖిల్లా: అణగారిన, బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం వస్తేనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని పలువురు బహుజన, సామాజిక నాయకులు, సాహితీవేత్తలు అన్నారు. జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహం ఎదుట ప్రముఖ కవి, రచయిత జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజన గణమన’ అనే కవితా సంపుటిని సోమవారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్ర ముఖ కవి డాక్టర్ దామెర రాములు మాట్లాడుతూ.. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం సాక్షిగా అందరికీ సమాన ఫలాలు అందాలంటే బడుగు బ లహీనవర్గాల్లో చైతన్య దీప్తి పెంపొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమ సమన్వయకర్త, కవి ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ.. జనాభాలో సింహభాగం ఉన్న బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పొందినప్పుడే ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. మహాత్మాజ్యోతిబాపూలే స్ఫూర్తితో బలహీనవర్గాలందరూ సమష్టిగా ఉద్యమించాలని సూచించారు. రచయిత గౌరీ శంకర్ సామాజిక చైతన్యస్ఫూర్తితో ఈ కవితా సంపుటిని రచించారని కవి, సామాజికవేత్త తుమ్మల దేవరావు అన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్తలు, బీసీసంఘాల ప్రతినిధులు చిలుక రమణ, వేణుగోపాలకృష్ణ, విజయ్‌కుమార్, నేరెళ్ల హనుమంతు, కత్రోజు అశోక్, సిరికొండ రమేశ్, బిట్లింగు నవీన్, నాగోరావు, బొంపాల చిన్నయ్య, పోలీస్ భీమేశ్, శనిగరపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.