
నానో యూరియాతోనే అధిక దిగుబడి
● జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్
లక్ష్మణచాంద: నానో యూరియా వినియోగంతో అన్నదాతలు అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్ పేర్కొన్నా రు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల రైతులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించా రు. యూరియా వాడకం తగ్గించాలని సూచించా రు. అధిక యూరియా వినియోగంతో కలిగే నష్టాల ను తెలియజేశారు. నానో యూరియా వైపు అడుగులు వేయాలని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ మండలంలో ఇది వరకు చేసుకోని రైతులు ఆయా క్లస్టర్ల పరి ధిలోని రైతు వేదికల వద్దకు వెళ్లి వెంటనే రిజిస్ట్రీ చేసుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకో కుంటే కేంద్రం ఇచ్చే పథకాలు వర్తించవని తెలిపా రు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఈట ల శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి వసంత్‌రావు, ఏఈవోలు పవిత్ర, సుష్మిత, మౌనిక, రైతులు పాల్గొన్నారు.