
కార్మికుల హక్కులు కాపాడుకుందాం
నిర్మల్‌చైన్‌గేట్: కార్మిక వర్గ హక్కులను కాపాడుకుందామని టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ల రాజన్న పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భా గంగా బుధవారం జిల్లా కేంద్రంలో టీయూసీఐ ఆ ధ్వర్యంలో భగత్‌సింగ్ భవన్ నుంచి కార్మికులు ర్యా లీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరారు. కార్మిక వ్యతిరే క చట్టాలను రద్దు చేయాలని, అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26వేలు, కనీస పింఛన్ రూ.9వేలు ఇవ్వాలని, కనీస మద్దతు ధరల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కార్మికశాఖలో తీసుకువచ్చిన పని గంటల పెంపు జీవో 282ను రద్దు చే యాలని కోరారు. బీడీ కార్మికులకు చేయూత పథ కం, జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక వ్యతిరే క విధానాలు మానుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య మం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాసాచారి, భూక్యా రమేశ్, టీయూసీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.గంగన్న, బ్యాంక్ మేనేజర్ రాథోడ్ శ్రీరామ్‌నా యక్, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కట్ల లక్ష్మి, లక్ష్మి, టీయూసీఐ జిల్లా నాయకులు ఎస్.లక్ష్మి, వీ మహేందర్, కిరణ్, గంగామణి, కిషన్, పోశెట్టి, రాజన్న, రాజు, భూమేశ్, రమేశ్, కార్మికులు పాల్గొన్నారు.