
పోక్సో చట్టంపై అవగాహన అవసరం
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కలెక్టర్ అభిలాష అభినవ్ పే ర్కొన్నారు. బుధవారం పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగా హన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బాలల పై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, విద్యార్థులందరికీ పాఠశాల స్థాయిలోనే చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు బాలలపై లైంగిక నేరాలకు పాల్పడినవా రికి కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని తెలిపా రు. కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా చట్టం రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణుడు డేవిడ్ రాజు ఉపాధ్యాయులకు పోక్సో చట్టం, పాఠశాలల నిర్వహణ, వ్యక్తిత్వ వికా సం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అ నంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, అ ధికారులు పోక్సో చట్టంపై ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి శ్రీవాణి, అదనపు కలెక్టర్ ఫైజా న్ అహ్మద్, డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ రాధిక, డీఈవో రా మారావు, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.