
ఫసల్ బీమా.. ఇవ్వని ధీమా
● పంటనష్టం జరిగితే పరిహారమేది? ● తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు
లక్ష్మణచాంద: ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లితే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో అన్నదాతలకు అండగా నిలి చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకం రాష్ట్రంలో అమలుకు నోచుకోవడంలేదు. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పథకం అమలులో ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం అమలులోకి తెచ్చి పంటల బీమా పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందక తీవ్రంగా నష్టపోతున్నారు.
కాంగ్రెస్ హయాంలోనూ నిరాశే..
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు పథకం అమలు గురించి పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలతో వివిధ రకాల పంటలు దెబ్బతినగా బాధిత రైతులు తీవ్రంగా నష్టపోయా రు. ఈ సంవత్సరం ఖరీఫ్ సాగు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు పంటల బీమాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారైనా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
లక్ష్మణచాంద మండలం పీచర వద్ద కొట్టుకుపోయిన మొక్కజొన్న (ఫైల్)