ఇక అంతరిక్ష విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

ఇక అంతరిక్ష విజ్ఞానం

Jul 10 2025 6:20 AM | Updated on Jul 10 2025 6:20 AM

ఇక అం

ఇక అంతరిక్ష విజ్ఞానం

నిర్మల్‌ఖిల్లా: ఖగోళ శాస్త్రంపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకు జిల్లాలో తొలి విడతలో నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఖగోళ శాస్త్ర ప్రయోగశాల (ఆస్ట్రానమీ ల్యాబ్‌) లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా విద్యార్థుల్లో గ్రహాలు, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువులపై అవగాహన పెరుగుతోంది. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రత్యేక చొరవతో ఇప్పటికే సుమారు రూ.20 లక్షలు వెచ్చించి జిల్లాలోని నా లుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఖగోళశాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. నిర్మల్‌ రూరల్‌ మండలం అనంతపేట కస్తూరిబా బాలికల విద్యాల యం, సోన్‌ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, మామడ మండలంలోని పొన్కల్‌ జె డ్పీ ఉన్నత పాఠశాలు, తానూరు మండలం భో సి ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలలు ఇప్పటి కే విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.

పరికరాలు.. ప్రయోజనాలు

ఖగోళ, భౌతిక శాస్త్ర ప్రయోగాలు, మానవ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని వి ద్యార్థుల్లో పెంపొందించేలా వివిధ రకాల న మూనాలు, విశ్వాంతరాళం, మానవ శరీర అవయవాల నమూనాలు తదితరాలు ఈ ప్రయోగశాలలో ఉన్నాయి. వాటి ఉపయోగాలివీ..

● ఈ ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం, ఖగోళ శాస్త్ర విషయాలపై అవగాహన పెరుగుతుంది.

● ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలో హైరిజర్వేషన్‌ టెలిస్కోప్‌లు, వర్చువల్‌ రియాలిటీ హెడ్సెట్‌లు, స్మార్ట్‌ టీవీలు, వివిధ శాసీ్త్రయ నమూనాల మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

● నేరుగా ఖగోళశాస్త్ర సంబంధిత వస్తువులను గమనించడం, వాటిని స్పర్శించడం, శాసీ్త్రయ వైఖరితో ప్రయోగాలు చేయడం, ఖగోళ శాస్త్ర భావనలను అర్థం చేసుకునే అవకాశం ఆస్ట్రా నమీ ల్యాబ్‌ల ద్వారా కలుగుతుంది.

● ఖగోళశాస్త్ర విషయాలపై విద్యార్థులకు అభిరుచి పెరుగుతుంది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై కూడా ఆసక్తి ఎక్కువవుతుంది.

● విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, ఇతర ఖగోళ పదార్థాలను స్వయంగా ప రిశీలించిన అనుభూతి ప్రయోగశాల ద్వారా విద్యార్థులకు కలుగుతుంది.

● విద్యార్థుల్లో ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో అన్వేషణ దృక్పథం ఏర్పడుతుంది.

సరికొత్త అనుభూతికి లోనయ్యా

ల్యాబ్‌లోకి అడుగుపెట్ట గానే కొత్తగా అనిపించింది. నక్షత్రాలు, తోకచుక్కలు, అంతరిక్షం లాంటివన్నీ చక్కగా అమర్చారు. సైన్స్‌ పాఠాల్ని ఈ ల్యాబ్‌లో నేర్చుకోవడం ఆసక్తిగా ఉంది. ఉపాధ్యాయులు బోధించిన అంశం ఇక్కడ ప్రయోగాత్మకంగా చూపుతున్నారు. ఇది సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది.

– అర్జున్‌, పదోతరగతి, జెడ్పీహెచ్‌ఎస్‌, పొన్కల్‌

పాఠం, ప్రయోగం ఇక్కడే..

మా బడిలోని ఆస్ట్రానమీ ప్రయోగశాలలో మా సార్లు పాఠం బో ధించడమే కాకుండా ఇక్కడే ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తున్నారు. మాకు కూడా సరికొత్తగా అనిపిస్తోంది. నేర్చుకున్న అంశం శా శ్వతంగా గుర్తుండేలా ప్రయోగశాల దోహదం చేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.

– రుచిత్‌, పదోతరగతి, జెడ్పీహెచ్‌ఎస్‌, పొన్కల్‌

విద్యార్థులకు పూర్తి ప్రయోజనం

ఇప్పటికే అన్ని రకాల స దుపాయాలతో ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టమవుతున్నాయి. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ప్రత్యేక దృష్టితో జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ఇవి విద్యార్థుల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష విషయాలపై అభిరుచి, ఆసక్తిని పెంచుతాయి.

– పీ రామారావు, డీఈవో

అనుభూతికి లోనవుతారు

ప్రత్యక్ష అనుభవాలు, పాఠ్యాంశం అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందుతుంది. తద్వారా ఖగోళ శాస్త్రం గురించి నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. ఆస్ట్రానమీ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులు ప్రత్యక్ష అనుభవాల ద్వారా ప్రత్యేక అనుభూతికి లోనవుతారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలి.

– అభిలాష అభినవ్‌, కలెక్టర్‌

అందుబాటులో ఆస్ట్రానమీ ల్యాబ్‌లు

జిల్లాలో నాలుగు స్కూళ్లలో ఏర్పాటు

పాఠ్యాంశాల బోధనకు ఊతం

అనుభూతికి లోనవుతున్న విద్యార్థులు

ఖగోళశాస్త్రంపై పెరుగుతున్న అభిరుచి

ఇక అంతరిక్ష విజ్ఞానం 1
1/5

ఇక అంతరిక్ష విజ్ఞానం

ఇక అంతరిక్ష విజ్ఞానం 2
2/5

ఇక అంతరిక్ష విజ్ఞానం

ఇక అంతరిక్ష విజ్ఞానం 3
3/5

ఇక అంతరిక్ష విజ్ఞానం

ఇక అంతరిక్ష విజ్ఞానం 4
4/5

ఇక అంతరిక్ష విజ్ఞానం

ఇక అంతరిక్ష విజ్ఞానం 5
5/5

ఇక అంతరిక్ష విజ్ఞానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement