
నిర్మల్
సమస్య గుర్తింపు ఇక ఈజీ
వివిధ విద్యుత్ సమస్యలు ఈజీగా గుర్తించేందుకు సంబంధిత శాఖ చర్యలు చేపట్టింది. అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా లైన్‌ఫాల్ట్ కండక్టర్లను ఏర్పాటు చేసింది.
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
8లోu
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గోడం నగేశ్
పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, భూగర్భగను ల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూ చించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉ మ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, సమీకరణాలు, తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. స్థానిక సమస్యలు, కార్యకర్తల అభిప్రాయాలు, రాబోయే ఎన్నికల కార్యాచరణపై సమీక్షించారు. పార్టీని బలంగా తీర్చిదిద్దేందుకు నియోజకవర్గ స్థాయిలో నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, నాయకురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అ ధ్యక్షతన నిర్వహించిన దిశ కమిటీ సమావేశం గరంగరంగా సాగింది. అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అధికారుల అలసత్వం.. సమావేశానికి అధికా రుల గైర్హాజరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప నులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్య, ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ప్రధానమంత్రి ఆవాస్, కేంద్రప్రభుత్వం, ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ పథకాల పురోగతిపై శాఖలవారీగా సమీక్షించారు.
‘కేంద్ర’ పథకాలు అమలు చేయాలి
గ్రామీణాభివృద్ధి, పేద ప్రజల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎంపీ నగేశ్ తెలిపారు. అవి పూర్తిస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 275(1), సీసీడీపీ (కంప్రహెన్సివ్ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్), ఎంపీసీ (మిషన్ ఫర్ ప్రొటీన్ చెయిన్) లాంటి పథకాల కింద జిల్లాకు వచ్చిన నిధులను సద్వినియోగం చేయాలని సూచించారు. అర్హులందరికీ ఉపాధిహామీ జా బ్‌కార్డులు జారీ చేయాలని, ప్రతీ కూలీకి 100 రోజు ల పనిదినాలు కల్పించాలని తెలిపారు. ఉపాధిహా మీకి అనుసంధానంగా జిల్లాలో చేపట్టిన రోడ్లు, పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల భ వనాలు, డ్రైనేజీ నిర్మాణాలకు అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభించాలని పేర్కొన్నా రు. సంబంధిత శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప నులను పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేసేలా చూడాలని తెలిపారు. ప్రధానమంత్రి అమృత్ 2.0, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన, పీఎం శ్రీ పథకా లను గుణాత్మకంగా అమలు చేయాలని పేర్కొన్నా రు. పట్టణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా కోసం చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అర్హ త కలిగిన రైతులందరికీ లబ్ధి చేకూర్చేలా చూడాల ని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు స మయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీఎం శ్రీకి ఎంపికై న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని, విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల రుణాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమాచారం లేకుండానే..
డిస్ట్రిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి జిల్లా అధికారులు అరకొర సమాచారంతోనే వచ్చారు. ఎంపీ గోడం నగేశ్ అడిగిన ఏ ప్రశ్నకూ సరైన సమాధానం ఇవ్వలేక పేపర్లు తిరగేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదని ఎంపీ అ ధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో నిర్వహించే దిశ కమిటీ సమావేశానికైనా పూర్తి స్థా యి సమాచారంతో రావాలని ఆదేశించారు. సమాచారమున్నా గైర్హాజరైన శాఖలకు నోటీసులు అందించాలని కలెక్టర్‌కు సూచించారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఘనంగా అకాడి పూజలు
కడెం: మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాల గిరిజనులు బుధవారం అకాడి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. పిల్లాపాపలు, పాడి పంటలతో తమను చల్లగా చూడాలని పెద్దమ్మతల్లిని వేడుకున్నారు. ఆల యంలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సమీప అటవీ ప్రాంతంలో జంతుబలి చేసి ఆవులను దాటించారు. గిరిజనులు ఆత్రం దేవురావు, కోవ ప్రవీణ్ తదితరులున్నారు.
న్యూస్‌రీల్
సైబర్ నేరాలపై అవగాహన
సోన్: సోన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్మల్ ఏఎస్పీ రా జేశ్ మీనా ఆధ్వర్యంలో బుధవారం సర్కిల్ క్రై మ్ మీటింగ్ నిర్వహించారు. సైబర్ నేరాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతీ గ్రా మంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చోరీలు జరగకుండా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు పోలీస్‌స్టేషన్ లోని రికార్డులు పరిశీలించారు. సీఐ గోవర్ధన్‌రెడ్డి, సోన్, మామడ, లక్ష్మణచాంద ఎస్సైలు గోపి, అశోక్, శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.
అధికారులకు ఎంపీ నగేశ్ సూచన
సమాచారంతో రాలేదని నిలదీత
కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశం
శాఖలవారీగా అధికారులతో సమీక్ష
కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈజీఎస్ కింద అర్హులందరికీ 100రోజుల పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 926 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, 201 కేంద్రాలు ప్రభుత్వ భవనాలు, 367 ప్రైవేట్ భవనాలు, 358 పాఠశాల భవనాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా 36 కేంద్రాలకు భవన నిర్మాణాలకు అనుమతులు లభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 20 భవన నిర్మాణాలు పూర్తి కాగా, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో 600 మహిళా సంఘాలకు రూ.58 కోట్ల రుణాలు అందించామని తెలిపారు. 130 పంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 36 భవనాలకు అనుమతులు మంజూరు కాగా, ఇప్పటివరకు 10 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ఇందుకు రూ.కోటి 13 లక్షల నిధులు ఖర్చు చేసినట్లు వివరించారు. జిల్లాలో రూ.47 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. అమృత్ 2.0 పథకం కింద మూడు నీటి ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు లభించాయని, పీఎంశ్రీ పాఠశాలల్లో బోధన నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు 11 సైన్స్ ల్యాబ్‌లు, 29 అదనపు తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు లభించినట్లు తెలిపారు. సమావేశంలో నిర్మల్, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్

నిర్మల్