
ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలి
ఖానాపూర్: రాష్ట్రంలోని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు ఎస్టీ బాలికల ఆశ్ర మ పాఠశాల, మస్కాపూర్, సుర్జాపూర్, తిమ్మాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లలో మంగళవారం సభ్యత్వ నమోదు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫారసులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులతోపాటు బకాయిపడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేకపోతే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భూమన్న, లక్ష్మణ్, నాయకులు గోవింద్‌నాయక్, రాజేశ్వర్, బాలాజీ, గంగాధర్, రాజన్న, అశోక్, మహేందర్ పాల్గొన్నారు.