
వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలి
నిర్మల్‌చైన్‌గేట్: బాలికల వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షే మ శాఖ బాలికల వసతి గృహాన్ని గురువారం తని ఖీ చేశారు. వంటగది, స్టోర్ రూం రికార్డులను పరి శీలించారు. విద్యార్థులకు అందుతున్న బోధన, మౌ లిక సదుపాయాలు, భోజన ఏర్పాట్లపై సమీక్షించా రు. విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు మెరుగైన వసతులు కల్పించాలన్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. పా ఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆమె వెంట గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి అంబాజీ, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.
● ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా