
మెరుగైన వైద్యం అందించాలి
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్‌ఎస్ సురేశ్ సూచించారు. భైంసా ఏరియా ఆస్పత్రి ని మంగళవారం సందర్శించారు. వార్డుల్లో కలియదిరిగారు. రోగులతో మాట్లాడి, సౌకర్యాలపై ఆరాతీశారు. అనంతరం వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించా రు. వర్షా కాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, రోగుల తాకిడికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులను ప్రైవేట్ ఆస్పత్రులకు రెఫర్ చేయవద్దన్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే మెరుగై న చికిత్స అందించాలని తెలిపారు. సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట వైద్యులు అనిల్, విజయానంద్, కై లాష్‌ప తి, పద్మావతి, సుమల తదితరులు ఉన్నారు.