
సమ్మె జయప్రదం చేయాలి
భైంసాటౌన్/ముధోల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.హరిత కోరారు. భైంసా పట్టణంలో, ముధోల్‌లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీ ఎత్తివేయాలని, రాజీనామా చేసిన కార్మికులందరికీ కనీస పెన్షన్ రూ.9 వే లు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, బీడీ కార్మికులకు షరతులు లేని రూ.4 వేల జీవనభృతి తదితర డిమాండ్ల సాధనకు సమ్మె చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీడీ కార్మికులు లక్ష్మి, విజయ, బేబి, విజయలక్ష్మి, నరేశ్, మల్లేశ్, గంగాధర్, మధుకర్, సురేష్, విఠల్, రాజేశ్వర్, రాజు పాల్గొన్నారు.