
విద్యుత్ సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
● వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ నారాయణ
దిలావర్‌పూర్: విద్యుత్ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది జాప్యం చేయవద్దని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీఆర్‌ఎఫ్–2)టీజీఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ చైర్మన్ ఎ.నారాయణ ఆదేశించారు. దిలావర్‌పూర్ సబ్‌స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుల పరిష్కార వేదిక మంగళవారం ఏర్పాటు చేశారు. విద్యుత్ వినియోదారులకు సిబ్బంది అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అందుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సమస్యలు, స్తంభాలు, లూజ్ లైన్స్‌కు సంబంధించినవే ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం 9 సమస్యలు రాగా, 5 సమస్యల పరిష్కారానికి వెంటనే ఆదేశించారు. దిలావర్‌పూర్ ఏఈపై వచ్చిన ఫిర్యాదులపై ఏఈ డి.శంకర్‌ను వివరణ కోరారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ సాలియానాయక్, డీఈ నాగరాజు, ఏడీఈ వెంకటపతిరాజు, దిలావర్‌పూర్, సారంగాపూర్, లక్ష్మణచాంద నిర్మల్‌రూరల్ మండలాల పరిధిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈలు, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్‌లు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.