
ఇద్దరు యువకుల బైండోవర్
నిర్మల్‌రూరల్: గంజాయి విక్రయిస్తున్నారన్న అనుమానంతో జిల్లా కేంద్రంలో ఇద్దరు యువకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. గుండంపెళ్లి గ్రామానికి చెందిన సత్యపోలు యోగేష్, భైంసా పట్టణం పురాణ బజార్‌కు చెందిన షేక్ కై ఫ్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్‌లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా వారి వద్ద ఎలాంటి గంజాయి లభించలేదు. కానీ భవిష్యత్‌లో గంజాయి సేవించడం లేదా విక్రయిస్తారన్న అనుమానంతో వారిద్దరిని రూరల్ తహసీల్దార్ సంతోష్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.