
సోలార్ ప్లాంట్ పనులపై సమీక్ష
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి నూతనంగా ఏర్పాటు చేస్తున్న 67.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ పనులపై ఏరియా జీఎం ఆఫీస్ ఆవరణలోని కాన్ఫ్‌రెన్స్ హాల్‌లో సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణ బుధవారం ఏరియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏరియా జీఎం దేవేందర్‌తో పాటు అధికారులను అడిగి పనుల అభివృద్ధిని తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ ఏర్పాటు పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జీఎం (ఈఅండ్‌ఎం) సోలార్ ఎనర్జీ జీఎస్ జానకీరామ్, ఎస్వో టూ జీఎం విజ య్‌ప్రసాద్, ఏరియా ఇంజనీర్ (ఈఅండ్‌ఎం) వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ శ్యామ్‌సుందర్, కేకే గ్రూపు ఏజెంట్ రాంబాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఐఈడీ రాజన్న పాల్గొన్నారు.