అకాల వర్షం.. తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

May 22 2025 12:10 AM | Updated on May 22 2025 12:10 AM

అకాల

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

రాజీవ్‌గాంధీకి నివాళి
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వాతావరణం
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది.
పుష్కరఘాట్లపై మట్టి కుప్పలు
బాసరలోని గోదావరి పుష్కరఘాట్లు అపరిశు భ్రంగా మారాయి. వాటిపైనున్న మట్టికుప్పల తో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
● కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం ● కొన్నిచోట్ల కొట్టుకుపోయిన వ డ్లు ● నేలవాలిన వరి, నువ్వు చేన్లు ● అవస్థలకు గురైన అన్నదాతలు

గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025

8లోu

లోకేశ్వరం/లక్ష్మణచాంద/కుంటాల/భైంసాటౌన్‌/భైంసారూరల్‌/మామడ/ఖానాపూర్‌/పెంబి/ దస్తురాబాద్‌/తానూరు: జిల్లాలో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం, సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన అకాల వర్షం రైతుల వరి ధాన్యాన్ని తడిపేసింది. రైతులు రాత్రిపూట ధాన్యం తడ వకుండా ఉండేందుకు నానా తిప్పలు పడ్డారు. చాలా కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జాప్యం కారణంగానే ధాన్యం తడిసినట్లు రైతులు ఆరోపించడం గమనార్హం. లోకేశ్వరం మండలం జోహర్‌ఫూర్‌, అబ్దుల్లాపూర్‌, రాయపూర్‌కాండ్లీ, ధ ర్మోరా, పంచగుడి, పిప్రి, వట్టోలి, గడ్‌చాంద, రా జూర, అర్లి, గొడిసెరా, నగర్‌ తదితర గ్రామాల్లో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, మె రుపులతో కురిసిన వర్షానికి వరి, నువ్వు చేన్లు నేలవాలాయి. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్ష్మణచాంద మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి వరి, నువ్వు ధాన్యం తడిసింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. లక్ష్మణచాంద మండలంలో బుధవారం సా యంత్రం కురిసిన కుండపోత వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కొట్టుకుపోయింది. కుంటాల మండలంలోనూ బుధవారం వేకువజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. అప్రమత్తమైన రైతులు కల్లాల వద్దకు పరుగులు పెట్టి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు. బుధవారం ఉదయం కురిసిన వర్షానికి భైంసా మండలంలోని దేగాం, ఇలేగాం, కామోల్‌, కుంసర, వానల్‌పాడ్‌, మహాగాం తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు అవస్థలు పడ్డారు. వాలేగాం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. భైంసా పట్టణంలోనూ భారీ వర్షం కురిసింది. మామడ మండలం పొన్కల్‌, మామడ, కొరిటికల్‌ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న, రైతులు సంచుల్లో నింపుకొన్న ధాన్యం తడిసింది. తానూరు మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఖానాపూర్‌ మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యం వరదనీటికి కొట్టుకుపోయింది. ఖానాపూర్‌ పట్టణంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురియగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శివాజీనగర్‌, బస్టాండ్‌ ఏరియాలో వరదనీరు డ్రైనేజీల నుంచి రోడ్లపై వరదలా పారింది. దీంతో పట్టణవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్‌ రూరల్‌ మండలం వెంగ్వాపేట్‌, తాంశా, కౌట్ల(కే) చించోలి, ముజ్జిగాలో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. పెంబి మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి, నువ్వు పంటలు, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కొన్ని చోట్ల వడ్లు వరద ఉధృతికి కోట్టుకుపోయాయి. మండలంలోని మందపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా ఎస్సై హన్మాండ్లు రైతులతో కలిసి కుప్పలపై టార్పాలిన్లు కప్పి సాయపడ్డారు.

దస్తురాబాద్‌ మండలంలోనూ ఇదే పరిస్థితి ఉంది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా సంబంధిత సిబ్బంది పునరుద్ధరించారు. మొత్తంగా అకా ల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం1
1/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం2
2/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం3
3/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం4
4/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం5
5/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం6
6/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

అకాల వర్షం.. తడిసిన ధాన్యం7
7/7

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement