
చలో.. చెన్నూర్!
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయం. అగస్త్య మహాముని నడయాడిన నేల. కోటి లింగాలకు నెలవు.
● ఇప్పటికీ పాతనేస్తాలకు ప్రాధాన్యం..
● రేడియో, టేప్ రికార్డర్, బ్లాక్‌అండ్‌వైట్ టీవీల వినియోగం
● ఆహ్లాదంగా ఆత్మీయంగా బంధాన్ని కొనసాగిస్తూ..
● అభిరుచిని ఆస్వాదిస్తున్న పలువురు జిల్లావాసులు..
రేడియోతో ఐదు దశాబ్దాల బంధం..
కుంటాల మండలానికి చెందిన వృద్ధ దంపతులు అరిగెల లక్ష్మీబాయి–గజ్జరాం 50 ఏళ్లుగా రేడియోతో తమ రోజువారీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. దుబాయ్ నుంచి బంధువులు తెచ్చిన ఈ రేడియోలో ఇప్పటికీ వార్తలు, భక్తి గీతాలు, కథలు వింటారు. వ్యవసాయ కూలీలైన వీరు ఆధునిక గాడ్జెట్‌లకు దూరంగా ఉంటారు.