
20న బీడీ కార్మికుల సమ్మె
నిర్మల్‌చైన్‌గేట్: ఈనెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు పాల్గొంటారని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ బీడీ ఫ్యాక్టరీలో యాజమాన్యాలకు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రాజన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కనీస వేతనాలు అమలు, కనీస పెన్షన్ రూ.9 వేలు, నాలుగు లేబర్ కోడ్‌లు, పని గంటల పెంపు తదితర సమస్యలపై జాతీయ కా ర్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపుని చ్చాయన్నారు. ఈ సమ్మెలో బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్స్, నెలసరి ఉద్యోగులు, మున్సి పల్ కార్మికులు, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొంటా రని తెలిపారు. నోటీసులు ఇచ్చినవారిలో కా ర్మిక సంఘ నాయకులు కిషన్, పోశెట్టి, రాజేందర్, లక్ష్మణ్, రవి, ఎల్లయ్య, గంగామణి, కమల, గంగాధర్, లక్ష్మి పాల్గొన్నారు.