
గ్రామీణాభివృద్ధి సంస్థకు అవార్డు
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) రాష్ట్రస్థాయి అవార్డు కై వసం చేసుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయడమేకాక, రికవరీలోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో హైదరాబాద్‌లోని మహాత్మాజ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రా మీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ, పంచా యతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్ అవార్డును ప్రదానం చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, డీపీఎం జ్ఞాను, ఏపీఎం సుదర్శన్ అవార్డు స్వీకరించారు.