రియల్‌ హీరోస్‌కు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

రియల్‌ హీరోస్‌కు గుర్తింపు

May 7 2025 12:05 AM | Updated on May 7 2025 12:05 AM

రియల్

రియల్‌ హీరోస్‌కు గుర్తింపు

● ప్రతికూల వాతావరణంలో.. ● ముగ్గురి ప్రాణాల ు కాపాడిన ఖాకీలు ● ఏడాది తర్వాత సీఐ గోపీనాథ్‌, ఎస్సై శ్రీకాంత్‌కు అవార్డులు

నిర్మల్‌: 21 జూలై 2024, అర్ధరాత్రి 2 గంటల సమయం. నిర్మల్‌ జిల్లాలో వర్షం ఆగకుండా కురుస్తోంది. నిర్మల్‌ బస్టాండ్‌ వద్ద నైట్‌ పెట్రోలింగ్‌ డ్యూటీలో ఉన్న డీసీఆర్‌బీ సీఐ జి. గోపీనాథ్‌, సారంగపూర్‌ ఎస్సై సల్ల శ్రీకాంత్‌ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అప్పుడే వచ్చిన ఫోన్‌ కాల్‌ వారిని అలర్ట్‌ చేసింది. మహబూబ్‌ఘాట్‌లో కారు లోయలో పడిపోయిందని, అందులోని వారు ప్రమాదంలో ఉన్నారని తెలిసింది. వెంటనే వాహనాన్ని ఘాట్‌ వైపు పరుగులు పెట్టించారు.

లోయలో చిక్కుకున్న కుటుంబం

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన దేవికా కల్యాణి, రాధాకృష్ణ దంపతులు తమ కుమారుడైన ప్రేమ్‌తో కలిసి తమ కారులో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వెళ్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఎన్‌హెచ్‌ 44పై ప్రయాణిస్తున్నారు. రాత్రి ప్రయాణం కావడంతో గూగుల్‌ డైరెక్షన్స్‌తో ముందుకు సాగుతున్నా రు. సరిగ్గా కడ్తాల్‌ దగ్గరికి రాగానే వారు బైపాస్‌గుండా వెళ్లాల్సి ఉండగా, గూగుల్‌ మ్యాప్‌ను ఫాలో అవుతూ.. నిర్మల్‌ జిల్లాకేంద్రంలో నుంచి పాత ఎన్‌హెచ్‌ 44 రోడ్డు గుండా వెళ్లారు. సరిగ్గా.. సారంగపూర్‌ మండలంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువుల్లో ఉన్న మహబూబ్‌ఘాట్‌ వద్దకు వచ్చారు. అర్ధరాత్రి 1.30 గంటలకు రెండో ఘాట్‌ కు చేరుకోగానే దారి కనిపించలేదు. అంతే.. రెప్పపాటులో వారి వాహనం అదుపుతప్పింది. రాధాకృష్ణ తేరుకునేలోపే పల్టీలు కొడుతూ కారు లోయలోకి పడిపోయింది. ఒక టేకు చెట్టు అడ్డుకోవడంతో కారు 150–200 అడుగుల లోతులో ఆగింది, లేకుంటే 400 అడుగుల లోతు లోయలో పడిపోయేది.

పురస్కారాలతో సత్కారం

ఈ ధైర్యసాహసాలకు సీఐ గోపీనాథ్‌, ఎస్సై శ్రీకాంత్‌లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ‘తెలంగాణ పోలీస్‌–రియల్‌ హీరోస్‌’ అవార్డులను అందుకున్నారు. ఎస్పీ జానకీషర్మిల సహా అందరూ వా రి సేవను ప్రశంసించారు. తాజాగా సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జీనెట్‌వర్క్‌ నుంచి సీఐ గోపీనాథ్‌(ప్రస్తు తం భైంసా సర్కిల్‌), ఎస్సై సల్ల శ్రీకాంత్‌(ఇప్పుడు కూడా సారంగపూర్‌ స్టేషన్‌) ‘తెలంగాణ పోలీస్‌–రియల్‌ హీరోస్‌’ అవార్డులను అందుకున్నారు.

ప్రతికూల వాతావరణంలో...

గాయాలతో బయటపడలేని స్థితిలో ఉన్న కుటుంబం, ఒక పాయింట్‌ సిగ్నల్‌తో 100 నంబర్‌కు కాల్‌ చేసి సహాయం కోరింది. పది నిమిషాల్లో ఘాట్‌కు చేరుకున్న సీఐ గోపీనాథ్‌, ఎస్సై శ్రీకాంత్‌లకు చీక టి, వర్షం, పొగమంచు ఇబ్బందులు సృష్టించాయి. కారు పార్కింగ్‌ లైట్ల సాయంతో స్థానాన్ని గుర్తించి, జారే బురదలో పాకుతూ లోయలోకి దిగారు. ముందుగా దంపతులను, ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది సాయంతో ప్రేమ్‌ను సురక్షించారు.

రియల్‌ హీరోస్‌కు గుర్తింపు1
1/2

రియల్‌ హీరోస్‌కు గుర్తింపు

రియల్‌ హీరోస్‌కు గుర్తింపు2
2/2

రియల్‌ హీరోస్‌కు గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement