
నిబద్ధతతోనే గుర్తింపు
భైంసాటౌన్: నిబద్ధతతో విధులు నిర్వహించినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని ఏఎస్పీ అవినాష్‌కుమార్ అన్నారు. పట్టణ సీఐ జి.గోపీనాథ్ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆయనకు మంగళవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాలువా, పూలమాలలతో సన్మానించారు. అనంతరం కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆపద సమయంలో స్పందించి సేవలందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సైలు కె.గణేశ్, శ్రీనివాస్‌యాదవ్, మహమ్మద్‌గౌస్, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.