
నిర్మల్
బాసర చూసొద్దామా..
చదువుల తల్లి కొలువుదీరిన బాసర ఇప్పుడు చూసేవారికి ఒకే గ్రామం. అమ్మవారు కొలువైన ఊరని అందరికి సుపరిచితమే. బాసర క్షేత్రం ప్రత్యేకతపై స్టోరీ.
భూ సమస్యల
సత్ఫలితాలిస్తున్న గడ్డి మైదానాలు
వన్యప్రాణుల సంతతి వృద్ధికోసం జన్నారం డివిజన్‌లో పెంచుతున్న గడ్డి మైదానాలు సత్ఫ లితాలిస్తున్నాయి. విత్తనాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
10లోu
సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025
ఆలయాల అభివృద్ధికి కృషి
కడెం: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దబెల్లాల్ ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహా విగ్రహ, ధ్వజ స్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఎలగడపలోని తాతమ్మ ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తుమ్మల మల్లేశ్, నాయకులు పొద్దుటూరి సతీశ్‌రెడ్డి, తక్కల్ల సత్తెన్న, చెన్ను మల్లేశ్, కటికనపెల్లి భూమేశ్, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్‌చైన్‌గేట్: భూభారతి చట్టం పరిష్కారం చూపించనుంది. ధరణి పోర్టల్‌లో రైతులకు ఎదురైన సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం చేశాక కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. దీని అమలుకు గతంలో రాష్ట్రంలోని నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా.. ప్రస్తుతం జిల్లాలోని కుంటాల మండలానికి స్థానం దక్కింది. ఈ మేరకు సోమవారం ప్రక్రియను తహసీల్దార్ ప్రారంభించగా ఈనెల 5 నుంచి 20 వరకు గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఆపై జూన్ 2 నుంచి రాష్ట్రమంతా చట్టం అమల్లోకి రానున్నందున సమస్యలు ఉండవని రైతులు భావిస్తున్నారు.
సాంకేతిక సమస్యలతో బేజారు..
ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తులకు పరిష్కారం లభించలేదు. ఇంకొన్ని సమస్యలు నమోదు చేసే వీలు లేకపోయేది. ప్రధానంగా పీబీ(ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్) సమస్యతో రైతులు సతమతమయ్యారు. పట్టా భూములను కూడా పీఓబీలో చేర్చడంతో భూముల భద్రతపై అనుమానం వ్యక్తమైంది. వీటితోపాటు ఇతర సమస్యలు కూడా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రతీరోజు రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
1,489 దరఖాస్తులు పెండింగ్
జిల్లాలో ధరణి సైట్ ద్వారా పలు సమస్యలపై అందిన దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తూనే మిగతా సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ధరణిలో మొత్తం 1,489 దరఖాస్తులు రైతుల నుంచి అందాయి. వీటిలో 345 తహసీల్దార్ల వద్ద, 857 ఆర్డీవోల వద్ద, 287 దరఖాస్తులు అదనపు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
జూన్ 2 నుంచి పూర్తిస్థాయిలో..
ఈ ఏడాది జూన్ నుంచి భూభారతి చట్టాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో మ్యూటేషన్లు, నాలా, మార్పులు, చేర్పులు, అప్పీల్ అండ్ రివిజన్, తదితర సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుంది. గ్రామాల్లో నిర్వహించే సదస్సుల్లో రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేస్తారు. ప్రస్తుతం కుంటాల మండలంలో భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. ఇందులో భాగంగా ఈనెల 17 నుంచి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలకు గానూ 30 వేల ఎకరాల సాగు భూమి ఉంది. సాదాబైనామా కింద అందిన 341 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులు భూభారతి ద్వారా పరిష్కరించనున్నారు.
పరిష్కారం ఇక సులువు..
భూభారతి చట్టంతో రైతులకు సంబంధించి సమస్యల పరిష్కారం సులువవుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేశాక అందులో అవసరమైన వాటిని పొందుపరిచారు. రైతులు తహసీల్‌లో అభ్యంతరాలు తెలియజేసే వీలు కూడా కల్పించారు. అయినా న్యాయం జరగకపోతే ఆర్డీవో, ఆపై కలెక్టర్‌కు ఆప్పీల్ చేసే వెసులుబాటు ఉంటుంది. గతంలో ధరణిలో ఇలాంటి అవకాశం లేక కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. కాగా కొత్త చట్టం ద్వారా ప్రతీ డిసెంబర్‌లో గ్రామ రికార్డులను ముద్రిస్తారు. 2014 జూన్ 2 కన్నా ముందు గ్రామాల్లో వ్యవసాయ భూమిని సాదాబైనామాల ద్వారా కొని అనుభవంలో ఉంటూ 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తులను ఆర్డీవో విచారించి ధ్రువీకరణ పత్రాలు చేసేలా భూభారతి చట్టం ద్వారా అవకాశం కల్పించారు.
న్యూస్‌రీల్
అమలులోకి భూభారతి చట్టం
పైలట్ ప్రాజెక్టుగా కుంటాల మండలం ఎంపిక
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కుంటాల మండలంలోని విట్టపూర్‌కు చెందిన కట్ట భూమారెడ్డి. ఇతనికి 4.13 ఎకరాలకు సంబంధించిన పాత పాసు పుస్తకం ఉంది. అప్పట్లో పహాణి, వన్–బి మండల కార్యాలయం ద్వారా పొందాడు. ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చాక కొత్త పాస్ బుక్ అందలేదు. దీంతో రైతు బీమా, రైతుబంధు పథకాలకు అర్హత కోల్పోయాడు. పలుమార్లు కలెక్టరేట్, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విన్నవించినా ధరణి పోర్టల్‌లో ఆప్షన్ లేని కారణంగా ఏంచేయలేమని అధికారులు చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ అందుబాటులోకి తేవడంతో ఇతని సమస్య తీరనుంది.
టీం 1 అధికారులు
ఏ.కమల్ సింగ్, తహసీల్దార్ (కుంటాల), మునీర్ అహ్మద్ నయాబ్ తహసీల్దార్ (బాసర), రాజేశ్వర్ గిరిదావర్ (కుంటాల), కిషన్, మండల సర్వేయర్ (తానూర్), వినోద్, రాహుల్ జూనియర్ అసిస్టెంట్, సాయన్న (కుంటాల), కార్తీక్, రికార్డ్ అసిస్టెంట్ (కుంటాల)
తేదీ రెవెన్యూ గ్రామం ప్రదేశం
5 మేధన్పూర్ జీపీ కార్యాలయం
6 సూర్యాపూర్ రైతు వేదిక
7 రాజాపూర్ ఎంపీపీఎస్
8 లింబాకే జీపీ కార్యాలయం
9 దౌనెల్లి జీపీ కార్యాలయం
12 అంభుగం జీపీ కార్యాలయం
టీం 3 అధికారులు
ఎజాజ్ హైమద్‌ఖాన్ తహసీల్దార్, దిలావర్పూర్, జే.గంగయ్య నయాబ్ తహసీల్దార్, తానూర్, ఖాదర్‌ఖాన్ సర్వేయర్, దిలావర్పూర్, సంతోష్ దీక్షిత్, జూనియర్ అసిస్టెంట్, దిలావర్పూర్, చిరంజీవి, రికార్డ్ అసిస్టెంట్, దిలావర్పూర్, పోశెట్టి, ఆపరేటర్, లోకేశ్వరం
తేదీ రెవెన్యూ గ్రామం ప్రదేశం
5 ఓలా రైతు వేదిక
6 లింబా(బి) జీపీ కార్యాలయం
7 వెంకూర్ జీపీ కార్యాలయం
8 వైకుంఠాపూర్ జీపీ కార్యాలయం
9 పెంచికల్పహాడ్ జీపీ కార్యాలయం
పైలట్ ప్రాజెక్టుగా కుంటాల..
భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రాజెక్ట్ కింద కుంటాల మండలం ఎంపికై ంది. ఇందుకు మూడు టీమ్‌లను ఏర్పాటు చేశాం. నాతో పాటు భైంసా, దిలావర్‌పూర్ తహసీల్దార్లు సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31లోపు పరిష్కరిస్తారు.
– ఏ.కమల్ సింగ్, తహసీల్దార్, కుంటాల

నిర్మల్

నిర్మల్