ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలు

May 4 2025 6:35 AM | Updated on May 4 2025 6:35 AM

ఎట్టక

ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలు

● ఫలించిన రాంపూర్‌, మైసంపేట్‌ వాసుల పోరాటం ● జీవో జారీ చేసిన ప్రభుత్వం

కడెం: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో పులుల సంరక్షణ కో సం అటవీ గ్రామాలను తరలించే ప్రక్రియలో భా గంగా కడెం మండలం రాంపూర్‌, మైసంపేట గ్రా మాలను పునరావాస గ్రామాలకు తరలించారు. గ తేడాది ఏప్రిల్‌ 15 నుంచి ఈ గ్రామస్తులు కడెం మండలం పాత మద్దిపడగ సమీపంలో కొత్త జీవ నం ప్రారంభించారు. అయితే, పునరావాసంలో భా గంగా వాగ్దానం చేసిన రెవెన్యూ పట్టాలు, పరి హారం కోసం వారు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. వారి నిరంతర పోరాటం ఫలించి, రెవెన్యూ పట్టాలు అందుకునేందుకు రంగం సిద్ధమైంది.

వాగ్దానాలు, ఆటంకాలు

రాంపూర్‌, మైసంపేట గ్రామాల నుంచి మొత్తం 142 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కుటుంబాలకు రెండు రకాల పరిహార ప్యాకేజీలను అటవీశాఖ ప్రకటించింది..

ప్యాకేజీ–1: 94 కుటుంబాలకు ఇళ్లు,

2.32 ఎకరాల సాగు భూమి కేటాయించారు.

ప్యాకేజీ–2: 48 కుటుంబాలకు రూ.15 లక్షల నగదు పరిహారం అందజేయాలని నిర్ణయించారు.

అయితే, పునరావాస కేంద్రంలో నచ్చన్‌ఎల్లాపూర్‌ జీపీ సమీపంలో కేటాయించిన భూములకు అటవీ పట్టాలు ఇస్తామని అధికారులు ప్రకటించడంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటవీ పట్టాలు తమకు సాగు భూములపై శాశ్వత హక్కులను ఇవ్వవని, రెవెన్యూ పట్టాలు మాత్రమే స్వీకరిస్తామని వారు గట్టిగా పట్టుబట్టారు.

సాగుయోగ్యంగా మార్చాలి...

మా గ్రామాలను తరలించి ఏడాది గడిచినా సాగు భూములకు పట్టాలివ్వలేదు. ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలివ్వడంతో అందరికీ మేలు జరుగుతుంది. పునరావాసం కింద అందించిన భూములను సాగు యోగ్యంగా మార్చాలి. నీటి సౌకర్యం కల్పించాలి.

– దేవురావు, పునరావాస గ్రామస్తుడు..

రెవెన్యూ పట్టాల కోసం పోరాటం

రెవెన్యూ పట్టాల కోసం గ్రామస్తులు ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం సాగించారు. కలెక్టర్‌, మ ంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర అధికారులను కలిసి తమ డిమాండ్‌ను విన్నవించారు. మంత్రి సీత క్క, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ సొసై టీ (హైటికాస్‌) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ సిద్దిఖీ మ ద్దతుతో వారు తమ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేశారు. ఈ పోరాటం ఫలితంగా, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నవీన్‌ మిట్టల్‌ మే 3న రె వెన్యూ పట్టాలు జారీ చేస్తూ జీవో విడుదల చేశారు.

ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలు1
1/1

ఎట్టకేలకు రెవెన్యూ పట్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement