
డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం
నిర్మల్‌చైన్‌గేట్: డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమి స్తామని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురా లు బీ సుజాత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద గల గాంధీవిగ్రహం చుట్టూ ఆశ వర్కర్లు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ని రసన తెలిపారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. ‘చలో హైదరాబాద్’కు వెళ్తున్న ఆశ వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో భ విష్యత్‌లో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రక ళ, కోశాధికారి రామలక్ష్మి, నాయకులు భాగ్యలక్ష్మి, మంగ, రాణి, సరోజ, సంగీత, లావణ్య, గంగ, ల క్ష్మి, కృష్ణవేణి, శారద, పద్మ తదితరులున్నారు.