లక్ష్మణచాంద: దక్షిణ భారత దేశంలోనే అష్ట భుజాలు కలిగిన ఏకై క ఆలయమైన శ్రీఅష్టభుజ వే ణుగోపాల స్వామి ఆలయంలో శనివారం అద్భుతం ఆవిష్క్రృతమైంది. స్వామి వారి పాదాలను ఉదయం 6.40 గటంలకు సూర్యకిరణాలు తాకాయి. ఈ సందర్భంగా పూజారి రమేశ్‌ఆచారి మాట్లాడుతూ ఏటా అక్టోబర్‌లో ఒకసారి, మార్చిలో మరో సారి సూర్యకిరణాలు మూలవిరాట్‌పై పడతాయని తెలిపారు.
అటవీ అడ్డంకులను
తొలగించాలి
● అసెంబ్లీలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్
కడెం: కవ్వాల్ టైగర్‌జోన్‌తో ఖానాపూర్ నియోజవర్గంలో అభివృద్ధి పనులకు అటవీ నిబంధనలు అడ్డంకిగా మారాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. జీరో అవర్‌లో నియోజకవర్గంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కడెం మండలంలోని లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు, అల్లంపల్లి, గంగాపూర్ రోడ్డు, దస్తురాబాద్ మండలంలో దేవునిగూడెం ఆలయ నిర్మాణ పనులకు, విద్యుత్ లైన్లకు, స్థానిక అవసరాల కోసం ఇసుకను తీసుకేళ్లేందుకు అటవీ అనుమతులు ఇవ్వాలని కోరారు.
వేణుగోపాలస్వామిని తాకిన సూర్య కిరణాలు