నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Mar 6 2025 1:36 AM | Updated on Mar 6 2025 1:34 AM

పక్షుల లెక్క తేలింది
జన్నారం అటవీ డివిజన్‌లో నిర్వహించిన సర్వేలో అధికారులు 201 రకాల పక్షులను గుర్తించారు. 11 రకాల పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు పేర్కొన్నారు.

గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025

ఎండిన పొలాల పరిశీలన

కడెం: ఈనెల 5న ‘పంట తడికి.. కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యవసాయాధి కారి అంజిప్రసాద్‌ మండలంలోని కొత్త మద్దిపడగ, ఎలగడప గ్రామాల్లో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించారు. కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఏవో దినేశ్‌, ఏఈవోలున్నారు.

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్‌ సేవలు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతీ పనికి సాంకేతికత ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్‌ అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్‌ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతువేదికలు, ఇతర ప్రజాసేవల సంస్థలకు అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్‌ సౌకర్యం అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మిషన్‌ భగీరథ పథకం పైపులైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్‌ కేబుల్‌ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ టీ–ఫైబర్‌ పరికరాలనూ అమర్చారు. అయితే ఇప్పటివరకు టీ–ఫైబర్‌ సేవలు అందుబాటులోకి రాలేదు.

ఎన్నికల్లోపు అందుబాటులోకి వచ్చేనా?

ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, వి జేతల వివరాలు ఇలా ప్రక్రియ అంతా ఇంటర్నెట్‌ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో సేవలు అందుబాటులో లేక మండల పరిషత్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించకముందే విద్యుత్‌ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో పంచాయతీల్లో రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్‌ సేవలు అందుబాటులోకి తేవాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్తాం

జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్‌కు సంబంధించిన పరికరాలు బిగించి విద్యుత్‌ కనెక్షన్లూ ఇచ్చారు. వాటి నుంచి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు డిజిటల్‌ సేవలు అందడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. డిజిటల్‌ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరమవుతాయి.

– శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి

న్యూస్‌రీల్‌

కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం) కార్డుల జారీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ ప్రక్రియపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమై కార్డులు జారీ చేసే క్రమంలో వైద్య బృందానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది తది తర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యూడీఐడీ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సూచించారు. 21 రకాల వైకల్యం కలిగినవారు యూడీఐడీ కార్డు పొందవచ్చని తెలిపారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగినవారు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌, వైద్యారోగ్యశాఖ అధికారులు గోపాల్‌, సునీల్‌, సురేశ్‌, డీపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

జాడలేని ఈ–పాలన

అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు డిజిటల్‌ రూపంలో అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. జిల్లావ్యాప్తంగా 396 గ్రామపంచాయతీలుండగా.. సుమారు 36మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్‌ కేబుల్‌, పరికరాలు బిగించారు. విద్యుత్‌ సౌకర్యం కోసం సోలార్‌ ప్లేట్లు, ఇన్వర్టర్‌ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్‌ కూడా నిర్వహించారు. క్లస్టర్ల వారీగా ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. అయితే పంచాయతీల్లో ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులోకి రాక ఈ–పాలన అమలులోకి రాలేదు. దీంతో చాలామంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్‌ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్‌ పరికరాలు నిరుపయోగమయ్యాయి. పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు ప్రజలకు డిజిటల్‌ సేవలు అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాల్లో ఏమైనా అవాంతరాలుంటే లబ్ధిదారులు మండల పరిషత్‌ కార్యాలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు చేతి రాత రశీదులే ఇస్తున్నారు

ఇంటర్నెట్‌ లేక సౌకర్యం లేక మరుగున పడిన ఈ–పాలన

నిరుపయోగమైన పరికరాలు

ఏ పనికై నా మండల కేంద్రానికే..

డిజిటల్‌ సేవలు అందేదెన్నడో!

సోన్‌ మండలం న్యూవెల్మల్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో టీ–ఫైబర్‌ నెట్‌ పరికరాలు ఇలా వృథాగా పడి ఉన్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కేబుల్‌ వైర్‌ వేసి ఫైబర్‌ నెట్‌ పరికరాలు బిగించినా కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో కొన్నేళ్లుగా పరికరాలు ఇలా నిరుపయోగమయ్యాయి. జిల్లాలో ఫైబర్‌ పథకం పనుల అమలు తీరుకు ఇదొక నిదర్శనం.

నిర్మల్‌1
1/5

నిర్మల్‌

నిర్మల్‌2
2/5

నిర్మల్‌

నిర్మల్‌3
3/5

నిర్మల్‌

నిర్మల్‌4
4/5

నిర్మల్‌

నిర్మల్‌5
5/5

నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement