● నేడు జాతీయ ఓటరు దినోత్సవం ● పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు | - | Sakshi
Sakshi News home page

● నేడు జాతీయ ఓటరు దినోత్సవం ● పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు

Jan 25 2025 12:35 AM | Updated on Jan 25 2025 12:35 AM

● నేడు జాతీయ ఓటరు దినోత్సవం ● పౌరులకు రాజ్యాంగం కల్పించ

● నేడు జాతీయ ఓటరు దినోత్సవం ● పౌరులకు రాజ్యాంగం కల్పించ

మంచిర్యాలడెస్క్‌: ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను నిర్దేశించేది ఓటరే. అభివృద్ధి వైపు పయనించాలన్నా.. సరైన పాలకులను ఎన్నుకోవాలన్నా ఓటరు చేతిలోనే ఉంది. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకుంటే దేశ భవిష్యత్‌ను నిర్దేశించే అస్త్రం అవుతుంది. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

ఇలా మొదలై..

ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు భారత ఎన్నికల సంఘం 2011 జనవరి 25నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిన నేపథ్యంలో అందుకు గుర్తుగా జనవరి 25ను ఎంచుకుంది. ‘‘ఓటు లాంటిది ఇంకొకటి లేదు.. నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’’ అనే నినాదంతో ఈ ఏడాది 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది.

మొదటి ఓటరు ఇక్కడే..

రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌. ఈ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్‌ మండలం మాలిని గ్రామంలో ఆత్రం రంభబాయి మొదటి ఓటరుగా ఉన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఓటరు జాబితా ప్రారంభం అవుతుంది.

మహిళలే అధికం..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్నింటిలోనూ మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉంది. పురుష ఓటర్లు 11,37,514 మంది ఉండగా.. మహిళలు 11,87,865మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 50,351మంది ఎక్కువగా ఉన్నారు.

ప్రతీ ఓటు విలువైనదే..

ఎన్నికల్లో ఓటే విజేతను నిర్ణయిస్తుంది. భారీ మెజార్టీ సాధించినా.. ఒక్క ఓటు తేడాతో అయినా గెలుపు గెలుపే. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాలే యాదయ్య 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సిర్పూర్‌ నియోజకవర్గం నుంచి 3088 ఓట్ల స్వల్ప మెజార్టీతో పాల్వాయి హరీష్‌బాబు గెలుపొందారు.

గుర్తుంచుకోండి..

మీ పురోగతి, మీ సంక్షేమం, మీ సంతోషం కోసం ఎన్నికల్లో ఓటు వేయడంలో ఎప్పుడూ విఫలం కావొద్దు.

– మాజీ రాష్ట్రపతి

డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం

ఉమ్మడి జిల్లా ఓటర్లు 23,28,426

పురుషులు 11,37,514

మహిళలు 11,87,865

18 ఏళ్లు నిండాలి..

18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అప్పుడే ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేసే హక్కు పొందవచ్చు. ఎన్నికల్లో పోటీకీ అవకాశం ఉంటుంది. 1989 కంటే ముందు 21ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. 1988లో రాజ్యాంగ 61వ సవరణ ద్వారా ఓటరు వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో 1989 మార్చి 28నుంచి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం 18ఏళ్లు నిండిన వారు ఓటు వేసే అవకాశం లభించింది. https:// voters. eci. gov. in/ వెబ్‌సైట్‌ ద్వారా, యేటా కలెక్టరేట్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు..

నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు సర్వీసు ఓటర్లు మొత్తం

సిర్పూర్‌ 1,15,323 1,15,811 16 305 2,31,455

ఆసిఫాబాద్‌ 1,13,815 1,15,813 16 121 2,29,765

చెన్నూర్‌ 96,964 99,049 7 141 1,96,161

బెల్లంపల్లి 88,109 90,286 13 178 1,78,586

మంచిర్యాల 1,39,306 1,42,421 26 365 2,82,118

ఆదిలాబాద్‌ 1,21,050 1,26,805 6 248 2,48,109

బోథ్‌ 1,03,554 1,10,453 2 579 2,14,588

ఖానాపూర్‌ 1,11,157 1,16,549 14 431 2,28,151

నిర్మల్‌ 1,23,088 1,37,730 21 248 2,61,087

ముధోల్‌ 1,25,148 1,32,948 17 293 2,58,406

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement