
సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయిస్తున్న రైతులు, నాయకులు
రైతులు సద్వినియోగం
తీసుకోవాలి
నిర్మల్‌చైన్‌గేట్: సరస్వతి కెనాల్, సదర్మాట్ ఆయకట్టు రైతుల కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకుని పంటలను కాపాడుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు సూచించా రు. జిల్లాలోని సరస్వతి కెనాల్, సదర్మాట్ ఆ యకట్టు పంటలను కాపాడేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జను ప్రత్యేకంగా కలిసి విన్నవించానని తెలిపారు. నీటిని విడుదల చేయాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే నీటిని విడుదల చేశారని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. రైతులకు నీటి ని విడుదల చేయించడంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పాత్ర ఏమీ లేదని పేర్కొన్నారు.
లక్ష్మణచాంద: సరస్వతి కాలువ ఆయకట్టుకు గురువారం నీటిని విడుదల చేశారు. వారం రోజులుగా కాలువ ద్వారా నీటి విడుదల ఆగిపోవడంతో పొట్టదశలో ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందారు. సమస్యను నిర్మల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, వెడ్మ బొజ్జుతోపాటు డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యేలు, డీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయించారు. ఎట్టకేలకు కాలువకే నీటిని విడుదల చేయడంతో సోన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం, దస్తురాబాద్ మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటిని విడుదల చేయించిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో నాయకులు సరికెల గంగన్న, అడ్వాల రమేశ్, హరీశ్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేలకు రైతుల కృతజ్ఞతలు