వడివడిగా ఫ్యూచర్‌ వైపు.. | Young India Skill University Works For Future City Development | Sakshi
Sakshi News home page

వడివడిగా ఫ్యూచర్‌ వైపు..

May 29 2026 12:57 PM | Updated on May 29 2026 2:40 PM

Young India Skill University Works For Future City Development

వేగంగా రేడియల్‌ రోడ్డు పనులు

పరిశ్రమలకు భూముల కేటాయింపులు.. నిర్మాణాలు

ఎఫ్‌సీడీఏ భవనం పనులు పూర్తి

జూన్‌ 2 లేదా 3న సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం

ప్రారంభానికి సిద్ధమైన ఎఫ్‌సీడీఏ భవనం 

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్‌సిటీ వైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ), యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ పనులు, రేడియల్‌ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకోగా.. మరోవైపు అమేజాన్‌ డేటాసెంటర్‌ విస్తరణ, కంట్రోల్‌ డేటా సెంటర్‌ పనులు మొదలయ్యాయి. ఎత్తయిన కొండలు, గుట్టలను చదును చేసే పనిలో పదుల సంఖ్యలో ఇటాచీలు, జేసీబీలు నిమగ్నమయ్యాయి. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఎఫ్‌సీడీఏ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూన్‌ 2 లేదా 3 తేదీల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీర్‌ఖాన్‌ పేటలోని స్కిల్‌ వర్సిటీ, ఎఫ్‌సీడీఏ పనులను పరిశీలించారు.

ఊపందుకున్న స్కిల్‌ వర్సిటీ పనులు..
మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలో స్కిల్‌ వర్సిటీ స్లాబ్‌ వర్క్‌ పూర్తై బ్రిక్స్‌ వర్క్స్‌ కొనసాగుతున్నాయి.    డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎఫ్‌సీడీఏ భవనం తుది మెరుగులు దిద్దుకుంటోంది. రూ.5,800 కోట్ల పెట్టుబడితో పనులు ప్రారంభించిన అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ (ఏడబ్ల్యూస్‌) డేటా సెంటర్‌కు తొలిదశలో 48 ఎకరాలు కేటాయించగా ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి, ఆపరేషన్‌ కూడా ప్రారంభించింది. దీనికి సమీపంలోనే 35 ఎకరాల్లో కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్‌ పనులు ప్రారంభమయ్యాయి.

శంకుస్థాపనలకు యాక్షన్‌ప్లాన్‌ 
మీర్‌ఖాన్‌పేటలో 24 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల అంచనా వ్యయంతో ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ భవనం నిర్మిస్తున్నారు. ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా మరికొన్ని భవనాలకు శంకుస్థాపన చేసేందుకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశారు. ఎన్‌ఐయూఎం, సింగరేణి భవనాలు సహా మరో 14 ఫార్మ కంపెనీలకు సంబంధించిన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ డీ) కేంద్రాలకు సైతం శంకుస్థాపనలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement