అతన్ని అరెస్టు చేయకపోతే నిరసన జంతర్‌మంతర్‌ని దాటి వెళ్తుంది!

Wrestlers Said Approach Olympians In Other Nations For Support - Sakshi

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లర్లు జంతర్‌ మంతర్‌ వద్ద పెద్ద  ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరసనకు రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతో.. రెజ్లర్లు తమ నిరసనను జంతర్‌ మంతర్‌ని దాటి మరింత ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించారు.

ఇతర దేశాల ఒలింపిక్‌ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించి వారి మద్దతును కూడా తీసుకుని తమ ఆందోళన మరింతగా ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బ్రిజ్‌ భూషణ్‌​ శరణ్‌సింగ్‌ని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇలానే చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారత​ స్టార్‌ రెజ్లర్లు ఒలింపిక్‌ పతక విజేతలు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ తదితరులు మే 21న పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద గత 23 రోజులుగా భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు.   

(చదవండి: అమితాబ్‌ బచ్చన్‌ పోస్ట్‌ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top