స్టీరింగ్‌ వదిలేసి కారుపైన యువకుడి స్టంట్స్‌.. ఊహించని ట్విస్ట్‌

Viral Video: Man Does Push Ups On Rof Of Moving Car, What next - Sakshi

‘ఆనందాన్ని ఎవరు కోరుకోరు... కానీ ఎంత మూల్యానికి’ అని థియేటర్లలో, టీవీలలో కనిపించే ప్రకటన గుర్తుండే ఉంటుంది. అచ్చం అలాంటి ఓ సంఘటనే ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రన్నింగ్‌ కారు పైకి ఎక్కి పుషప్స్‌ చేసిన ఓ వ్యక్తికి యూపీ పోలీసులు ఊహించని ట్విట్స్‌ ఇచ్చారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. ఉజ్వల యాదవ్‌ అనే కుర్రాడు సోలోగా కారు డ్రైవింగ్‌ చేస్తూ షికారు కెళ్లాడు. రహదారిపైకి రాగానే స్టన్నింగ్‌ స్టంట్స్‌ చేద్దామని భావించి డ్రైవ్‌ చేస్తున్న స్టీరింగ్‌ వదిలేసి కారు పైకి ఎక్కాడు.. రన్నింగ్‌లో ఉన్న కారుమీదనే పుషప్స్‌ చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 61 వేల మంది వీక్షించడంతోపాటు వందలాది మంది కామెంట్‌ చేశారు.

నెట్టింటా చక్కర్లు కొట్టిన ఈ వీడియో కాస్తా చివరికి ఉత్తర ప్రదేశ్‌లో పోలీసుల కంటికి చిక్కింది. ఇంకేముంది ఉజ్వల్‌ చేసిన ఘనకార్యానికి పోలీసులు తగిన మూల్యం విధించారు. ‘కొన్ని పుషప్స్‌ మిమ్మల్ని చట్టం దృష్టిలో పడేస్తాయి. ఎంతో కష్టపడ్డావ్‌ కదా. నీ కష్టానికి ఇదిగో బహుమతి’ అంటూ అతనికి భారీగానే చలాన్‌ విధించారు. డ్రైవింగ్‌ చేస్తూ విన్యాసాలు చేయడం నేరమని. ఇది మీతోపాటు ఇతరులకు హానీ కలిగించవచ్చు అని యూపీ పోలీసులు తమ ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే ఇలా ఎవరైన చేస్తే కఠిన చర్యలు తప్పవని ఐపీఎస్‌ అధికారి అజయ్‌ కమార్‌ హెచ్చరించారు. దీంతో పోలీసుల పనితీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక స్టంట్స్‌తో హీరో అవుదామనుకున్న ఉజ్వల్‌కు చివరికి పోలీసులు షాక్‌ ఇవ్వడంతో ఖంగుతిన్నాడు. అయితే అలా చేసినందుకు క్షమాపణలు కోరుతూ.. మరోసారి రిపీట్‌ చేయనంటూ చెప్పడం కొసమెరుపు.

చదవండి:
 గాలి మోటార్‌ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ
ఈ అమ్మడుకు భయమే లేదు అసలు..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top