Viral Video: ఏనుగుల బ్రేక్‌ ఫాస్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా!

Viral Video: Elephants Enjoying Breakfast At Tamil Nadu Tiger Reserve - Sakshi

మాములుగా అడవిలో ఉండే జంతువులు తమకు నచ్చని ఆహారాన్ని స్వేచ్ఛగా తినేస్తాయి. అదే జంతుశాలలోనూ లేదా టైగర్‌ రిజర్వ్‌లలోనూ ఉంటే వాటి బాగోగులను నిర్వహణ అధికారులే చూస్తారు. అయితే అక్కడ వాటికి ఆహారం ఎలా అందిస్తారో, ఎలా తయారు చేస్తారో వంటి వాటికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఏనుగులన్ని ఎలిఫెంట్‌ క్యాంప్‌ వద్ద బ్రేక్‌ ఫాస్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాయి.

వాటికోసం పశువైద్యులు బియ్యం, రాగులు, బెల్లం కలిపిన ఆహారాన్ని పెద్ద పెద్ద సైజు బంతుల్లో తయారు చేసి వాటికి అందిస్తున్నారు. అందులో ఒక ఏనుగు తనకు ముందు పెట్టమన్నట్లుగా తొండంతో శబ్దం చేయడం వీడియోలో చూడవచ్చు. ఇది తమిళనాడులోని ముదుమలై టైగర్‌ రిజర్వ్‌లోనిది. ఈ వీడియోని ఐఏఎస్‌ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఐతే పలువురు నెటిజన్లు అవి స్వేచ్ఛగా ఆహారం తినేలా చేయాలి, ఇది కరెక్ట్‌ కాదు అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్‌ చేశారు.   

(చదవండి: ఆప్‌ ఎన్నికల అభ్యర్ధి తుపాకీతో డ్యాన్సులు.. వీడియో వైరల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top